పిల్లర్ల మధ్య చిక్కుకున్న చిన్నారి | Girl Child Struck in Iron Pillars in Thiruthani Railway Station Tamil Nadu | Sakshi
Sakshi News home page

పిల్లర్ల మధ్య చిక్కుకున్న చిన్నారి

Feb 9 2019 11:43 AM | Updated on Feb 9 2019 11:43 AM

Girl Child Struck in Iron Pillars in Thiruthani Railway Station Tamil Nadu - Sakshi

రెండు స్తంభాల మధ్యలో తల చిక్కుకున్న చిన్నారిని ప్రయాణికులు రక్షించారు.

చెన్నై ,తిరుత్తణి: రెండు స్తంభాల మధ్యలో తల చిక్కుకున్న చిన్నారిని ప్రయాణికులు రక్షించారు. ఈ సంఘటన తిరుత్తణిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రం గ్రామానికి చెందిన వేలు కార్మికుడు. అతని భార్య మాలతి, ఐదేళ్ల పాప కృత్తిక సహా గురువారం సాయంత్రం తిరుత్తణి రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు. చెన్నైకు రైల్‌లో వెళ్లేందుకు రెండవ ప్లాట్‌ఫాంలో వేచి ఉన్నారు. అక్కడ చిన్నారి ఆడుకుంటోంది. హఠాత్తుగా చిన్నారి తల ఇనుప పిల్లర్ల మధ్యలో చిక్కుకుంది. దీంతో చిన్నారి కేకలు వేసింది. ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గడ్డపారతో రెండు స్తంభాలను చీల్చి చిన్నారిని క్షేమంగా వెలుపలికి తీశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement