విజయనగరం జిల్లా ఎస్.కోటలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్.కోటలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన రాంసింగ్, బాబాసాగలనాథ్ ఎస్.కోట బస్టాండ్ వద్ద ఉండగా వారిని పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 15 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు.