మీ ఖాతాలో రూ. 1.84 కోట్లు జమ చేశారు | farmer gets message that 1.84 crores credited in his bank account | Sakshi
Sakshi News home page

మీ ఖాతాలో రూ. 1.84 కోట్లు జమ చేశారు

Dec 18 2016 1:29 PM | Updated on Oct 1 2018 2:44 PM

అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి అవాక్కయ్యాడు.

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతుంటే, కొందరు కుబేరుల వద్ద కోట్లాది రూపాయల డబ్బు బయటపడుతోంది. ప్రతి రోజూ విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్లకు చెందిన ఓ రైతు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి అవాక్కయ్యాడు.

శ్రీనివాసులు నాయుడు అనే రైతుకు తాడిపత్రి ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఎకౌంట్‌లో కోటి 84 లక్షల రూపాయల డబ్బు జమ చేసినట్టు అందులో ఉంది. ఈ విషయం తెలియగానే శ్రీనివాసులు నాయుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తమ దగ్గర అంత డబ్బు లేదని, ఈ మెసేజ్‌ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన భార్య సుజాత చెబుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసులు నాయుడి ఖాతాలో ఈ డబ్బు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో బ్యాంకు అధికారులు ఈ విషయంపై స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement