
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపలి వరకు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాగా, ఆదివారం స్వామివారిని 1,01,018 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.85 అని అధికారులు తెలిపారు.