కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
తాడేపల్లి: కుటుంబకలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం డోలాస్నగర్‌కు చెందిన నర్సింహారావు, దుర్గ దంపతులు మంగళవారం రాత్రి గొడవపడ్డారు. బుధవారం ఉదయం దంపతులిద్దరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే మంటలను ఆర్పి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.