బాలుడి ప్రాణం తీసిన నిర్లక్ష్యం

Child Death in Karnataka - Sakshi

డబ్బా గొంతులో ఇరుక్కుని మృతి

కర్ణాటక, యశవంతపుర : డబ్బా గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన విజయపుర జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు... తికోటా పట్టణానికి చెందిని విశ్వనాథ్‌ తాళికోటి కుమారుడు మల్లు (తొమ్మిది నెలలు). ఉదయం చిన్నారి మల్లుకు ఇంటిలోని వారు సున్నం డబ్బీ చేతికి ఇచ్చి  ఇంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో బాలుడు డబ్బీని నోటిలో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. విషయం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top