బ్యూటీ పార్లర్లో పురుషులను ట్రాప్ చేసి.. | cheating custemers in the name of beautiparlour in banglore | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్లర్లో పురుషులను ట్రాప్ చేసి..

Jul 10 2016 5:46 PM | Updated on Sep 4 2017 4:33 AM

బ్యూటీ పార్లర్లో పురుషులను ట్రాప్ చేసి..

బ్యూటీ పార్లర్లో పురుషులను ట్రాప్ చేసి..

స్పా బ్యూటీ పార్లర్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ జంట పోలీసులకు పట్టుబడింది.

బొమ్మనహళ్లి (బెంగళూరు): స్పా బ్యూటీ పార్లర్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కస్టమర్ల నుంచి  డబ్బులు డిమాండ్  చేస్తున్న ఓ జంట పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన భానసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. బానసవాడి పోలీసుల  కథనం మేరకు. మేఘాలయకు చెందిన అక్కిం కోమ్ కమ్మనహళ్లిలో హెయిర్ డో స్పా అండ్, బ్యూటీ పార్లర్‌లో   కొన్ని సంవత్సరాలుగా పని చేస్తోంది. అక్కడికి వచ్చే పురుషులను ట్రాప్ చేసేవారు.

అనంతరం ప్రియుడు చాచోరాయ్ కలిసి వారికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని వేధించే వారు. కమ్మనహళ్ళికి చెందిన జాజ్ అనే వ్యక్తిని ఇలాగే బుట్టలోకి వేసుకున్న ఈ జంట శనివారం ఉదయం ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో జాజ్ శనివారం బానసవాడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   పోలీసులు దాడిచేసి ఈ కిలాడి జంటను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement