కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..! | chandra babu wants to allot seats to defected mlas, says kvp ramachandra rao | Sakshi
Sakshi News home page

కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..!

Sep 8 2016 3:29 PM | Updated on Mar 23 2019 9:10 PM

కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..! - Sakshi

కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..!

కొనుక్కున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చేందుకే అసెంబ్లీ సీట్లు పెంచాలని టీడీపీ చూస్తోందన్నారు.

తెలుగుదేశం పార్టీ వాళ్లు వేరే పార్టీ నుంచి కొనుక్కున్న లేదా దత్తత తీసుకున్న ఎమ్మెల్యేలకు రేపు రాబోయే ఎన్నికలలో సీట్లు ఇచ్చుకోడానికే అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తుతో సంబంధం లేదని, అందుకే కేంద్రం ఏం చెప్పినా దానికి హర్షామోదాలు చెబుతున్నారని అన్నారు.

చంద్రబాబు తరఫున కేంద్రంతో బేరసారాలు సాగించిన నాయకులు కూడా అదే చెప్పారన్నారు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం చంద్రబాబు చేతికి కేంద్రం డబ్బు ఇస్తుందని, అందులోంచి ఆయనకు కావల్సిన లబ్ధి చేకూర్చుకుంటారని.. ఇందులో ప్రజలకు మిగిలేది సున్నా మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement