చెబితే 50 %, దాస్తే 85 %

చెబితే 50 %, దాస్తే 85 % - Sakshi


నల్లధన కుబేరులు కట్టాల్సిన పన్నుమొత్తాలివి

స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను

దాడుల్లో స్వాధీనం చేసుకున్నదానిపై 85 శాతం

ఆదాయ పన్ను చట్టానికి భారీ సవరణలు

ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన జైట్లీ

నోట్ల రద్దుపై కొనసాగిన ఆందోళనలు

ప్రధాని సభకు వస్తారని ప్రకటించిన రాజ్‌నాథ్


న్యూఢిల్లీ: నల్లకుభేరులకు మోదీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. భారీగా జరిమానా చెల్లించి నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం ఆదాయపన్ను చట్టానికి భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. సభలు వారుుదా పడేముందు తొలుత లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ఆయన ఐటీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.



బిల్లులోని ప్రధానాంశాలు..

తమ వద్ద ఉన్న లెక్కల్లో చూపని ఆదాయాన్ని వెల్లడిస్తే 50 శాతం పన్నుగా చెల్లించాలి. మిగిలిన 50 శాతం కేంద్రం వద్ద ఉంటుంది. ఈ 50 శాతంలో వెంటనే 25 శాతం, నాలుగేళ్ల తర్వాత మరో 25 శాతం తీసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 30 శాతం పన్ను, పది శాతం పెనాల్టీలపై 33 శాతం సర్‌ఛార్జి విధిస్తే దాదాపు 50 శాతం పన్ను అవుతుంది. అధికారులు దాడుల్లో నల్లధనాన్ని వెలికితీస్తే దానిపై ఫ్లాట్ 60 శాతం పన్ను విధిస్తారు. ఇందులో 25 శాతానికి సర్‌చార్జి (15 శాతం) కలిపితే మొత్తం దాదాపు 75 శాతం వరకూ పోరుునట్లే. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10 శాతం పెనాల్టీ వేయాలని నిర్ణరుుంచే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు మళ్లించి దేశంలో వివిధ పేదరిక నిర్మూలన పథకాలు చేపట్టనున్నారు. కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే ఈ చట్టం కింద చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


రాజ్యసభలోనూ వారుుదాలు..

పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభ కూడా అట్టుడికింది. ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని.. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశారుు. సభ ప్రారంభమైనప్పటి నుంచే కార్యకలాపాలకు అడ్డుతగిలారుు. ఈ క్రమంలో పలుమార్లు సభను వారుుదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు బీజేపీ సభ్యుడిని ఉద్దేశించి ‘దలాల్’ (దళారీ) అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళన పెద్దనోట్ల రద్దు అంశంపైకి మళ్లింది. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. పలువురు సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించకపోవడంతో సభను రేపటికి వారుుదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు.


క్యాస్ట్రోకు ఉభయ సభల నివాళి

గత రెండు రోజుల క్రితం కన్నుమూసిన క్యూబా విప్లవ వీరుడు, మాజీ అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రోకు ఉభయ సభలు నిమిషం పాటు నివాళులర్పించారుు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ క్యూబా నాయకుడి విజయాలను ప్రస్తుతించారు. ‘వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన విజేత క్యాస్ట్రో... ఆయన మరణం క్యూబా ప్రజలకు, ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. అనంతరం రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుండగానే... ప్రతిపక్ష సభ్యులు పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగించారు.


ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ

అమరావతి: పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను సూచించడానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి నేతృత్వం వహిస్తారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.500, రూ.1,000 వెరుు్యనోట్లను రద్దు చేయాలని కోరుతూ బాబు గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుుతే రూ.రెండు వేల నోటును ప్రవేశపెట్టడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 


ఉభయసభల్లో నోట్ల రద్దు రగడ

పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లో వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆందోళనలు కొనసాగారుు. ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చిన పెద్దనోట్ల రద్దుపై చర్చలో పాల్గొనాలని విపక్షాలు డిమాండ్ చేశారుు. లోక్‌సభ సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేపట్టారుు. సభకు ప్రధాని వచ్చి చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారుు. ఈ ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్లకార్డులు, పేపర్లు ప్రదర్శించొద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు. అరుునప్పటికీ అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభను వారుుదా వేశారు. తిరిగి భేటీ అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే  మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.


నగదు కోసం ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారని, ఇది వరకే 70 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇచ్చిన వారుుదా తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అనుమతివ్వాలని కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, ఎస్పీ సభ్యులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు పరిస్థితి సద్దుమణగబోదన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ సుదీర్ఘ చర్చోపచర్చల తరువాతే నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పేదలకు ఇది మేలు చేస్తుందన్నారు. విపక్షాలు కోరుకుంటే దీనిపై ప్రధాని సభకు వచ్చి మాట్లాడుతారని చెప్పారు. దీనిపై ఏ నిబంధన కింద చర్చ జరపాలనేది స్పీకరే నిర్ణరుుస్తారని స్పష్టం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top