ఠాణేలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు | Arrangement of special court in Thane Jail | Sakshi
Sakshi News home page

ఠాణేలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు

Sep 27 2013 12:58 AM | Updated on Sep 1 2017 11:04 PM

ఠాణే ప్రాంతంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో పెరిగిన

ముంబై: ఠాణే ప్రాంతంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో పెరిగిన నేరాలు, ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం శాంతిభద్రతలు, న్యాయ వ్యవస్థలను పటిష్ట పర్చడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు అనుమతి కోరింది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కోర్టు పనిచేసే విధంగా అనుమతి మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో కోరింది. పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలకు హైకోర్టు తన ఆమోదం తెలిపింది. 
 
ఈ ప్రత్యేక కోర్టులో 13 మంది సిబ్బంది నియామకానికి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కోర్టుకు అదనపు జిల్లా జడ్జి హోదా గల న్యాయాధికారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జడ్జికి నివాసం ఏర్పాటు చేయాల్సిందిగా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌కు సూచిం చింది. ఇలాంటి ప్రత్యేక కోర్టులు మరిన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సచివాలయ అధికారులు తెలిపారు. ఠాణే పట్టణం చుట్టుపట్ల వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, ఫలితంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement