గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి | AP minister palle tells about relationship with gangster madhu | Sakshi
Sakshi News home page

గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి

Oct 20 2016 7:19 PM | Updated on Sep 4 2017 5:48 PM

గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి

గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి : ఏపీ మంత్రి

గ్యాంగ్స్టర్ మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

అనంతపురం : గ్యాంగ్స్టర్ ఎర్నంపల్లి మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతలో గురువారం ఆయన మాట్లాడుతూ...గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అతను పనిచేశాడని చెప్పారు. బెంగళూరులో మధు ల్యాండ్ సెటిల్మెంట్లతో మాత్రం ఎలాంటి సంబంధం లేదని పల్లె పేర్కొన్నారు. (చదవండి : బెంగళూరులో గ్యాంగ్ వార్)
 
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యాంగ్స్టర్ మధు టీడీపీలో చేరాడు. మంత్రి పల్లె బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధును కలుస్తాడని తెలుస్తోంది. సెటిల్మెంట్ల వ్యవహారంలో మధు దొరికిపోవడంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు భారీగా సెటిల్మెంట్లు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement