
ప్రభుదేవా విందులో నటి తేజస్విని
ప్రభుదేవా విందుకు నటి తేజస్విని హాజరవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. నయనతారతో ప్రేమ బెడిసి కొట్టిన తర్వాత ముంబైలో
టీ నగర్: ప్రభుదేవా విందుకు నటి తేజస్విని హాజరవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. నయనతారతో ప్రేమ బెడిసి కొట్టిన తర్వాత ముంబైలో బస చేస్తున నటుడు, దర్శకుడు ప్రభుదేవా హిందీ చిత్రాల దర్శకత్వంలో నిమగ్నమయ్యారు. తరచుగా చెన్నై, బెంగళూరుకు వచ్చి సన్నిహితులను కలవడం, వారికి విందులు ఇచ్చి పిచ్చాపాటి మాట్లాడుతారు. ఇటీవల ఆయన చెన్నై చేరుకున్నప్పుడు విందు ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొనేందుకు తనకు అత్యంత ఆప్తులైన దర్శకులు, నటులను ఆహ్వానించారు. నటీమణుల్లో కన్నడ హీరోయిన్ తేజస్వినికి మాత్రం ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆమె కూడా ఆ విందులో పాల్గొన్నారు. ఆమెను మిగతా వారికి ప్రభుదేవా పరిచయం చేశారు.
దీని గురించి తేజస్విని మాట్లాడుతూ చాలా రోజులుగా తనకు ప్రభుదేవా బాగా తెలుసని, అతనితో తరచూ టచ్‌లో వుంటున్నానన్నారు. ఇటీవల ఆయన చెన్నై రాగా తనను ఆహ్వానించారని, తానూ ప్రస్తుతం చెన్నైలోనే వుంటున్నట్లు తెలిపారు. ఆయన సన్నిహితులకు పార్టీ ఇస్తూ తననూ ఆహ్వానించారన్నారు. హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తారా? అని ప్రశ్నించగా తమ పరిచయం దేన్నీ ఆశించి ఏర్పడలేదని, తాము సహజంగా మసలుతున్నామన్నారు. తేజస్విని వ్యాఖ్యలను బట్టి చూస్తే స్నేహానికి అతీతంగా వారి బంధం బలపడుతున్నట్లు మీడియా వర్గాలు గుసగుసలాడాయి. త్వరలో వీరి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.