ఆప్ రెండో జాబితాలో రాష్ట్రం నుంచి పది మంది | Aam Aadmi Party releases second list of lok sabha elections candidates | Sakshi
Sakshi News home page

ఆప్ రెండో జాబితాలో రాష్ట్రం నుంచి పది మంది

Feb 27 2014 11:01 PM | Updated on Oct 8 2018 6:18 PM

లోక్‌సభ ఎన్నికల కోసం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో మహారాష్ట్రలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది.

 సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల కోసం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో మహారాష్ట్రలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో పది మంది అభ్యర్థులను ప్రకటించి తాము ఎన్నికలకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చింది.

 తాజాగా ప్రకటించిన జాబితాలో ఠాణే నుంచి సంజీవ్‌మానే,  షోలాపూర్ నుంచి లలిత్ బాబర్, బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో నందు మాధవ్, మావల్ నుంచి మారుతి భాపకర్, అమరావతి నుంచి భావనా వాసనిక్, సాంగ్లీ నుంచి శమినా ఖాన్, గోండియా నుంచి ప్రశాంత్ మిశ్రా, చంద్రాపూర్ నుంచి వామన్‌రావ్ చటప్, ఔరంగాబాద్ నుంచి సుభాష్ లోమటే, జాల్నా నుంచి దీపక్ మస్కేలు ఉన్నారు. దీనికి ముందు ప్రకటించిన మొదటి జాబితాలో మేధా పాట్కర్ (ఈశాన్య ముంబై), మీరా సన్యాల్ (దక్షిణ ముంబై), మయంక్ గాంధీ (వాయవ్య ముంబై), విజయ్ పాండరే (నాసిక్) అంజలీ దమానియా (నాగపూర్) తదితరులు ఉన్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement