ఆర్యతో పెళ్లికి 70 వేల దరఖాస్తులు | 70,000 applications for Arya wedding | Sakshi
Sakshi News home page

ఆర్యతో పెళ్లికి 70 వేల దరఖాస్తులు

Feb 20 2018 3:33 AM | Updated on Aug 17 2018 2:31 PM

70,000 applications for Arya wedding - Sakshi

పెరంబూరు(చెన్నై): తమిళ నటుడు ఆర్య ఇటీవల వధువు కావలెను అని ఇంటర్నెట్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఏకంగా 70 వేల మంది యువతులు దరఖాస్తులు చేసుకుంటే, వారిలో ఆరు వేల మంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరిని షార్ట్‌లిస్ట్‌ చేసి 18 మందిని ఎంపిక చేశారు.

వయాకామ్‌ 18 అనే పారిశ్రామిక సంస్థ తమిళనాడులో కలర్స్‌ తమిళ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చానల్‌ బిజినెస్‌ హెడ్‌ అనూప్‌ చంద్రశేఖరన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గేమ్‌ షో లాంటి మంచి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్‌ చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో ‘ఇంగవీట్లు మాప్పిళ్‌లై’ అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరుడిగా పాల్గొనాలని కోరగా, ఆర్య సమ్మతించారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement