యప్‌ టీవీకి బీసీసీఐ హోం సీజన్‌ డిజిటల్‌ హక్కులు

YuppTV Bags The Digital Broadcast Rights For BCCI Home Season - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం యప్‌టీవీ బీసీసీఐ హోం సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని యప్‌టీవీ యూజర్లు తమ ఫేవరెట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఈ ఫ్లాట్‌ఫాంపై వీక్షించే వెసులుబాటు కలిగింది. బీసీసీఐ హోం సీజన్‌లో​ శ్రీలంక, ఆస్ర్టేలియా, సౌత్‌ఆఫ్రికా, ఇండియాలు తలపడే మ్యాచ్‌లను క్రీడాభిమానులు లైవ్‌లో చూసే అవకాశం యప్‌టీవీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

యూరప్‌, మధ్య ఆసియా, సార్క్‌ దేశాలకు చెందిన యూజర్ల చెంతకు ఈ ఆసక్తికర స్పోర్టింగ్‌ ఈవెంట్‌ను యప్‌టీవీ చేరవేస్తోంది. ఈ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ను తమ యూజర్లు లైవ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు తాము బీసీసీఐ హోం సీజన్‌ డిజిటల్‌ హక్కులను కైవసం చేసుకున్నామని యప్‌టీవీ వ్యవస్ధాపక సీఈఓ ఉదయ్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు యప్‌టీవీలో వీక్షించవచ్చు. యప్‌టీవీ.కాంను లాగ్‌ అవడం లేదా స్మార్ట్‌టీవీల్లో యప్‌టీవీ యాప్‌ల ద్వారా వివిధ స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డివైజ్‌ల్లో ఆయా మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చని యప్‌ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top