వెస్టిండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. గురువారం నాలుగో రోజు కడపటి వార్తలందే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కన్నా ఇంకా 78 పరుగులు వెనకబడే ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 73/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్.. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. విలియమ్సన్ (178 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వాట్లింగ్ (14 బ్యాటింగ్), రూథర్‌ఫర్డ్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.