‘మేం మా బ్రాండ్‌ క్రికెట్‌ ఆడాలి’.. | We have got to play our brand of cricket, says Australia's stand-in-skipper David Warner | Sakshi
Sakshi News home page

‘మేం మా బ్రాండ్‌ క్రికెట్‌ ఆడాలి’..

Oct 10 2017 9:46 AM | Updated on Oct 10 2017 10:54 AM

David_Warner

సాక్షి, గువాహటి: వరుస ఓటముల నుంచి గట్టెక్కాలంటే ఆస్ట్రేలియన్‌ బ్రాండ్‌ క్రికెట్‌ ఆడాలని ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ డేవిడ్‌వార్నర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 4-1తో వన్డే సిరీస్‌ కోల్పోగా తాజా టీ-20 సిరీస్‌లో 1-0 భారత్‌ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) జరిగే రెండో టీ20కి గువాహటి చేరిన ఆసీస్‌ జట్టు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేసింది. ప్రాక్టీస్‌ అనంతరం వార్నర్‌ మీడియాతో మాట్లాడారు.

‘మేం వరుస ఓటములకు చింతించడం లేదు. మేం కోల్పోయిన మా ఆసీస్‌ బ్రాండ్‌ క్రికెట్‌ను 100 శాతం తిరిగి సాధిస్తాం. మిడిలార్డర్‌ విఫలం, మంచి భాగస్వామ్యాలు నమోదుచేయకపోవడంతో ప్రతి ఒక్కరు విసుగు చెందారు. అందులోంచి తేరుకోలేకపోతున్నారు. ఒత్తిడి గురించే మాట్లాడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ల గురించే చర్చిస్తున్నారు. ప్రతి ఒక మ్యాచ్‌ను గెలవాడానికే ‍ప్రయత్నిస్తున్నాం. ఒక విజయం సాధిస్తే ఇక్కడ మనం చాలెంజింగ్‌ చేయవచ్చు. కొంచెం కష్టమైన అందరి శక్షి సామర్థ్యాల మేరకు రాణిస్తే అది చాల సులువ’ని వార్నర్‌ సహచరులను ఉద్దేశించి పేర్కొన్నాడు. యాషెస్‌ సిరస్‌పై స్పందిస్తూ.. ‘దాని గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఇప్పుడు మా దృష్టంతా ఈ టీ20 మీదనే ఉంది. ఇది మేం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌. ఆటగాళ్లకు బిజీ షెడ్యూల్‌ ఉండటం సహజమేన’ని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement