
సాక్షి, రాంచీ: మిడిలార్డర్ విఫలమవ్వడం, ఓపెనింగ్ శుభారంభం అందకపోవడంతోనే ఓటమిని ఎదుర్కోవల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ డెవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. భుజ గాయంతో టీ20 సిరీస్‌కు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. భారత్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లి సేన 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ ఓటమిపై వార్నర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరుత్సాపరిచింది. తరువాతి మ్యాచ్‌కు మంచి ప్రణాళికలతో సిద్దమవుతాం. ఆ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోము. మ్యాచ్ మెత్తం జరిగితే విజయానికి దగ్గరగా వచ్చేవాళ్లము. మా బౌలర్లు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ మిడిలార్డర్ మరోసారి విఫలం అయింది. గత మ్యాచుల్లో నేను ఫించ్‌తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పా. కానీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యా ..ఇవే మా ఓటమికి కారణమయ్యాయి. మా తప్పులను సవరించుకుంటామని’ వార్నర్ పేర్కొన్నాడు.