క్వార్టర్స్‌లో వృశాలి | Vrsali in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో వృశాలి

Jul 21 2017 1:43 AM | Updated on Sep 5 2017 4:29 PM

క్వార్టర్స్‌లో వృశాలి

క్వార్టర్స్‌లో వృశాలి

రష్యా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు గుమ్మడి వృశాలి, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ ...

న్యూఢిల్లీ: రష్యా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు గుమ్మడి వృశాలి, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్‌ నగరంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వృశాలి 11–8, 15–14, 11–6తో అనస్తాసియా షరపోవా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రాహుల్‌ యాదవ్‌ 11–13, 11–4, 11–6, 11–7తో నాలుగో సీడ్‌ శుభాంకర్‌ డే (భారత్‌)పై గెలుపొందాడు.
 
టాప్‌ సీడ్‌కు కశ్యప్‌ షాక్‌

మరోవైపు కాలిఫోర్నియాలో జరుగుతున్న యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో పారుపల్లి కశ్యప్, శ్రీకృష్ణప్రియ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో కశ్యప్‌ 21–16, 10–21, 21–19తో టాప్‌ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్‌ లీ హున్‌ (కొరియా)ను ఓడించగా... శ్రీకృష్ణప్రియ 21–13, 21–16తో మాయా చెన్‌ (అమెరికా)పై గెలిచింది. అయితే రుత్విక శివాని 14–21, 27–25, 16–21తో అయా ఒహోరి (జపాన్‌) చేతిలో, ఉత్తేజిత రావు 25–23, 13–21, 16–21తో గేల్‌ మహులెట్టి (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement