కోహ్లికి ‘పెటా’ అవార్డు

Virat Kohli Named PETA India Person Of The Year - Sakshi

న్యూఢిల్లీ: పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌ (పెటా) భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని 2019 ఏడాదికిగాను ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 31 ఏళ్ల కోహ్లి రాజస్తాన్‌లోని అంబర్‌ కోట వద్ద మాల్తి అనే ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ ‘పెటా’కు లేఖ రాశాడు. మూగ జీవాలపట్ల కరుణ చూపాలని తన అభిమానులకు సందేశం కూడా ఇచ్చాడు. జంతువుల్ని కొనుగోలు చేయడం కంటే దత్తత తీసుకోవాలని సూచించాడు. గతంలో భారత్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్‌ పనికర్‌ రాధాకృష్ణన్, బాలీవుడ్‌ నటీమణులు అనుష్క శర్మ, హేమ మాలిని, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్, హీరో మాధవన్‌లు ‘పెటా’ పర్సన్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డులకు ఎంపికయ్యారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top