విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్ | Vijender has the skills to be world champion: British trainer Lee Beard | Sakshi
Sakshi News home page

విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్

May 17 2016 1:26 AM | Updated on Sep 4 2017 12:14 AM

విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్

విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్

ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఇప్పటి వరకు చూపిన ఏకాగ్రత, క్రమశిక్షణను అలాగే కొనసాగిస్తే భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్

లండన్: ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఇప్పటి వరకు చూపిన ఏకాగ్రత, క్రమశిక్షణను అలాగే కొనసాగిస్తే భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్ అవుతాడని అతని ట్రెయినర్ లీ బియర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను చాలా మందికి శిక్షణ ఇచ్చా. వాళ్లతో పోలిస్తే విజేందర్ నైపుణ్యం అమోఘం. ప్రపంచ చాంపియన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి’ అని బియర్డ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తలపడిన ఆరు బౌట్లలో విజేందర్... టెక్నికల్ నాకౌట్ ద్వారా ప్రత్యర్థులను ఓడించాడు. ‘

వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే రెండు వారాల వ్యవధిలోనే విజేందర్ రెండు బౌట్లలో పోటీపడ్డాడు. ఇది చాలా గొప్ప ప్రదర్శన. తన కంటే మెరుగైన ప్రత్యర్థులపై పోటీపడటమంటే సాధారణ విషయం కాదు. రింగ్‌లో విజేందర్ చాలా వేగంగా స్పందిస్తాడు అతని ఆలోచనా విధానం, కదలికలు, పంచ్ పవర్ సూపర్బ్. అయితే పెద్ద ఫైట్స్‌లో గెలవాలంటే కొన్ని కీలక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్‌గా భవిష్యత్‌లో ప్రపంచ టైటిల్‌కు ఇతడు కూడా ఓ పోటీదారు అవుతాడు’ అని బియర్డ్ విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement