
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పూర్తి అండగా నిలిచాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో విజయ్ బౌలింగ్ ఉపయుక్తంగా మారుతుందంటూ ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌కు అతడి ఎంపికను సమర్థించాడు. విజయ్ గురించి ప్రతికూలంగా ఆలోచించవద్దని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాదిరిగానే అతడు ప్రపంచ కప్‌లోనూ రాణిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.