ప్రముఖ ప్రచురణ సంస్థ ‘విజ్డన్’ ప్రకటించిన ఆల్‌టైమ్ టెస్టు జట్టులో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్‌కు చోటు లభించింది.
లండన్: ప్రముఖ ప్రచురణ సంస్థ ‘విజ్డన్’ ప్రకటించిన ఆల్‌టైమ్ టెస్టు జట్టులో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్‌కు చోటు లభించింది. తమ 150వ వార్షికోత్సవ సందర్భంగా విజ్డన్ ఈ జాబితాను వెల్లడించింది. ఈ 11 మంది సభ్యుల జట్టుకు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
జట్టు వివరాలు: బ్రాడ్‌మన్ (కెప్టెన్), షేన్‌వార్న్ (ఆస్ట్రేలియా), జాక్ హాబ్స్, డబ్ల్యూజీ గ్రేస్, అలన్ నాట్, సిడ్నీ బార్నెస్ (ఇంగ్లండ్), వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, మాల్కం మార్షల్ (వెస్టిండీస్), సచిన్ టెండూల్కర్ (భారత్), వసీమ్ అక్రమ్ (పాకిస్థాన్).