87 పరుగులకే సర్దేశారు.. | Vidarbha won by 10 wickeks against andhra | Sakshi
Sakshi News home page

87 పరుగులకే సర్దేశారు..

Dec 17 2015 3:20 PM | Updated on Jun 2 2018 2:08 PM

ఆంధ్ర కెప్టెన్ ప్రశాంత్ కుమార్(ఫైల్ ఫోటో) - Sakshi

ఆంధ్ర కెప్టెన్ ప్రశాంత్ కుమార్(ఫైల్ ఫోటో)

విజయ్ హజారా వన్డే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఢిల్లీ:విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్-సిలో భాగంగా ఇక్కడ గురువారం విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. టాస్ గెలిచిన విదర్భ తొలుత ఆంధ్రను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది.  దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర కనీసం రెండంకెల స్కోరును దాటడానికి ఆపసోపాలు పడింది. కెప్టెన్ ప్రశాంత్ కుమార్(38) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా,  మిగతా వారంతా వరుసగా క్యూకట్టడంతో ఆంధ్ర 25.3 ఓవర్లలో 87 పరుగులకే చాపచుట్టేసింది.

 

విదర్భ బౌలర్లలో స్పిన్నర్ కరణేశ్వర్ నాలుగు వికెట్లు తీసి ఆంధ్ర వెన్నువిరచగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు సాధించాడు.అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విదర్భ వికెట్ నష్టపోకుండా 19.2 ఓవర్లలో 91 పరుగుల చేసి ఘన విజయాన్ని అందుకుంది. విదర్భ ఓపెనర్లు జితేష్ శర్మ(47 నాటౌట్), ఫైజ్ ఫజల్(44 నాటౌట్) జట్టుకు అద్భుతమైన గెలుపునందించారు. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన ఆంధ్ర మూడింట ఓటమి చెందగా, రెండింట మాత్రమే విజయం సాధించింది. కాగా, తాజా విజయంతో 16 పాయింట్లు సాధించిన విదర్భ  గ్రూప్-సి టాపర్ గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement