బొటాస్‌కు ‘పోల్‌’ పొజిషన్‌ | Valtteri Bottas beats Lewis Hamilton to pole position at Abu Dhabi | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు ‘పోల్‌’ పొజిషన్‌

Nov 26 2017 1:36 AM | Updated on Aug 21 2018 9:00 PM

Valtteri Bottas beats Lewis Hamilton to pole position at Abu Dhabi - Sakshi

అబుదాబి: ఫార్ములావన్‌ సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. క్వాలిఫయింగ్‌ సెషన్‌లో బొటాస్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 36.231 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్‌ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. బొటాస్‌ కెరీర్‌లో ఇది నాలుగో ‘పోల్‌’ కావడం విశేషం.  హామిల్టన్‌ రెండో స్థానం నుంచి, ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా 8, 9 స్థానాల నుంచి మొదలు పెడతారు. 

Advertisement
 
Advertisement
Advertisement