బౌల్ట్‌ వచ్చేశాడు  | Trent Boult Back to The Team For Test Match Against India | Sakshi
Sakshi News home page

బౌల్ట్‌ వచ్చేశాడు 

Feb 18 2020 1:42 AM | Updated on Feb 18 2020 1:42 AM

Trent Boult Back to The Team For Test Match Against India - Sakshi

వెల్లింగ్టన్‌: కుడి చేతి గాయంతో భారత్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లకు దూరమైన న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో భారత్‌తో ఈ నెల 21 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు బౌల్ట్‌ ఎంపికయ్యాడు. కేన్‌ విలియమ్సన్‌ సారథిగా 13 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ సోమవారం ప్రకటించింది. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో గాయపడిన బౌల్ట్‌ తిరిగి జట్టులోకి రావడంతో కివీస్‌ బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారింది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన 6 అడుగుల 8 అంగుళాల కైల్‌ జేమీసన్, ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌లు కూడా జట్టులోకి ఎంపికయ్యారు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించిన నీల్‌ వ్యాగ్నర్‌తో పాటు టిమ్‌ సౌతీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. 
న్యూజిలాండ్‌ టెస్టు జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, వాట్లింగ్, టామ్‌ బ్లన్‌డెల్, ట్రెంట్‌ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, జేమీసన్, టామ్‌ లాథమ్, మిచెల్, హెన్రీ నికోల్స్, ఎజాజ్‌ పటేల్, టిమ్‌ సౌతీ, నీల్‌ వ్యాగ్నర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement