భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం నేడు (మంగళవారం) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం నేడు (మంగళవారం) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ 21 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ తీసుకోనుంది. ఈనెల 25న కోచ్‌ను ప్రకటిస్తారు. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఆమ్రే, వెంకటేశ్ ప్రసాద్, టామ్ మూడీ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
అయితే ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. కమిటీ సూచించే పేరును బోర్డు వర్కింగ్ కమిటీకి ప్రతిపాదిస్తారు.