క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.... చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా సంచలన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.
మొహాలీ: ప్రధాన మ్యాచ్‌లకు ఒక్క రోజు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్‌రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు లీగ్‌లో పాయింట్ల బోణీ చేసింది.
పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్తో ట్రినిడాడ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్‌లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్‌లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది.
అంతకు ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్‌దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్‌స్పిన్నర్ కరణ్‌శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్‌దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160.
వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156.
బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2; మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164.
వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142.
బౌలింగ్: రామ్‌పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
ఒటాగో x పెర్త్
సా. గం. 4.00 నుంచి
రాజస్థాన్ x లయన్స్
రా. గం. 8.00 నుంచి
వేదిక: జైపూర్
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
పెరీరా మెరుపులు
Published Wed, Sep 25 2013 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణ ఇదే..
భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement