
గ్రూప్ ‘ఎ’లో భారత్
భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు.
అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల
ముంబై: భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం ఆరు గ్రూపుల్లో 24 జట్లు తలపడనున్నాయి. అయితే గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్‌కు కఠిన పోటీయే ఎదురుకానుంది. రెండుసార్లు చాంపియన్ (1991, 95)గా నిలిచిన ఘనాతో పాటు యూఎస్‌ఏ, కొలంబియా ఈ గ్రూప్‌లోనే ఉన్నాయి.
ఆరు వేదికల్లో జరిగే ఈ టోర్నీ అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరుగుతుంది.గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోనే జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆరు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో పాటు ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి, ఫిఫా కౌన్సిల్ సభ్యుడు సునీల్ గులాటి, భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పాల్గొన్నారు.