ఐపీఎల్‌తో పోల్చలేం | Tendulkar, Ganguly among Indian soccer league owners | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌తో పోల్చలేం

Apr 15 2014 12:44 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఐపీఎల్‌తో పోల్చలేం - Sakshi

ఐపీఎల్‌తో పోల్చలేం

త్వరలోనే ఆరంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)ను....

 ఐఎస్‌ఎల్‌పై గంగూలీ వ్యాఖ్య
 కోల్‌కతా: త్వరలోనే ఆరంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)ను.... ఇప్పటికే విజయవంతమైన ఐపీఎల్‌తో పోల్చలేమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. ఓ విధంగా ఫుట్‌బాల్‌లో ఇలాంటి లీగ్‌ను నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని అని అంగీకరించాడు.

అయినా భవిష్యత్‌లో ఆట అభివృద్ధి చెందడమే కాకుండా లాభాలు కూడా దక్కించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఐఎస్‌ఎల్‌ను క్రికెట్‌తో పోల్చకూడదు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాం.

 మేం పెట్టిన డబ్బు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. క్రికెట్‌లాగే ఫుట్‌బాల్‌కు కూడా కార్పొరేట్ల నుంచి మద్దతు కావాలి’ అని గంగూలీ కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement