తెలంగాణకు 9 పతకాలు | Telangana Got 9 Medals in National Athletics Tourney | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 9 పతకాలు

Feb 7 2019 10:34 AM | Updated on Feb 7 2019 10:34 AM

Telangana Got 9 Medals in National Athletics Tourney - Sakshi

అడ్డగుట్ట: జాతీయ స్కూల్‌ అథ్లెటిక్స్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో తెలంగాణ బృందం మొత్తం 9 పతకాలను గెలుచుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శివాని, మైథిలి, మెడ్లీ, రూప, అక్షిత, ఇందుప్రియలతో కూడిన రాష్ట్ర బృందం 6 రజతాలు, 3 కాంస్యాలను సాధించింది.

రాష్ట్రం లోని పలు జిల్లాలకు చెందిన ఈ విద్యార్థినులు జాతీయ స్థాయిలో రాణించడం హర్షనీయమని స్కూల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ సరళ అన్నారు. లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పతకాలు సాధించిన వారిని అభినందించారు. ఈ ప్రదర్శనతో వీరంతా జాతీయ క్యాంపులో చోటు దక్కించుకున్నారని తెలిపారు. శిక్షణలో మెరుగ్గా రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విద్య, వసతితో పాటు మెరుగైన అథ్లెటిక్స్‌ శిక్షణను అందిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement