రన్నరప్ తెలంగాణ | telangana as runner up in basket ball championship | Sakshi
Sakshi News home page

రన్నరప్ తెలంగాణ

Jan 16 2017 11:42 AM | Updated on Sep 5 2017 1:21 AM

రన్నరప్ తెలంగాణ

రన్నరప్ తెలంగాణ

సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన తెలంగాణ మహిళల జట్టు తుది పోరులో మాత్రం తడబడింది.

పుదుచ్చేరి: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన తెలంగాణ మహిళల జట్టు తుది పోరులో మాత్రం తడబడింది. జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక్కడ జరిగిన ఫైనల్లో తెలంగాణ 59-68తో కేరళ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తెలంగాణ తరఫున ఎం.గాయత్రి 16 పారుుంట్లు సాధించగా... విజేత జట్టు తరఫున పి.ఎస్. జీనా 20 పారుుంట్లు చేసింది. పురుషుల ఈవెంట్‌లో ఉత్తరాఖండ్ 68-60తో తమిళనాడుపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో పుదుచ్చేరి సీఎం వి. గవే పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement