జోరు పెంచిన టీమిండియా | team india slow batting in ahmedabad ODI | Sakshi
Sakshi News home page

జోరు పెంచిన టీమిండియా

Nov 6 2014 7:03 PM | Updated on Aug 17 2018 5:55 PM

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో 275 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ జోరు పెంచింది.

అహ్మదాబాద్: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో 275 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ జోరు పెంచింది. 20 ఓవర్లకు ఆచితూచి ఆడిన కోహ్లి సేన తర్వాత నుంచి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 21.2 ఓవర్లలో భారత్ స్కోరు బోర్డు 100 పరుగులు దాటింది. శిఖర్ ధావన్ అర్థ సెంచరీ పూర్తి చేసిన జోరు పెంచాడు. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతకిది 10వ అర్థ సెంచరీ. అంబటి రాయుడి నుంచి మంచి సహకారం లభించింది.

భారత్ ఓపెనర్ అజింక్య రహానే(8) త్వరగా అవుటవడంతో కోహ్లి సేన మొదట ఆత్మరక్షణలో పడింది. వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. తర్వాత నుంచి వేగం పెంచింది. శ్రీలంక కూడా మొదట నెమ్మదిగా ఆడి తర్వాత వేగం పెంచింది. భారత్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనబడుతోంది. శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement