అరంగేట్రంలోనే అదరగొట్టే క్యాచ్‌ ! | Tayla Vlaeminck Takes An Absolute Stunner To Dismiss Veda Krishnamurthy | Sakshi
Sakshi News home page

Nov 18 2018 12:25 PM | Updated on Nov 18 2018 12:26 PM

Tayla Vlaeminck Takes An Absolute Stunner To Dismiss Veda Krishnamurthy - Sakshi

టేలో వ్రియోమెంక్‌ అద్భుత క్యాచ్‌

 చిరుత పులిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో..

ప్రొవిడెన్స్‌ (గయానా) : అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అద్భుత క్యాచ్‌తో అదరగొట్టింది. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత మహిళలతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన టేలో వ్రియోమెంక్‌.. అదిరిపోయే క్యాచ్‌తో ఔరా అనిపించింది. భారత ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆశ్లీగ్‌ గార్డనర్‌ వేసిన బంతిని వేదా కృష్ణమూర్తి బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడింది. అయితే ఇది గ్యాప్‌ షాట్‌గా భావించిన అందరూ ఖచ్చితంగా ఫోర్‌ అనుకున్నారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్‌ చేస్తున్న టేలో వ్రియోమెంక్‌ చిరుత పులిలా  గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకుంది.

ఈ అద్భుత ఫీట్‌తో మైదానంలోని ఆటగాళ్లు.. అభిమానులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. వేదాకృష్ణ మూర్తి (3) అయితే తను ఔటయ్యానా? లేదా? అనే సందిగ్ధంలో మైదానం వీడింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ‘ ఇది టీ20ల్లో అరంగేట్రం చేసిన టేలో వ్రియోమెంక్‌ సంబంధించిన ప్రత్యేకత.. ఇదో అద్భుత క్యాచ్‌’  అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు చెలరేగడంతో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్‌బీ టాప్‌లో నిలిచిన హర్మన్‌ సేన.. గురువారం సెమీస్‌లో వెస్టిండీస్‌ లేక ఇంగ్లండ్‌తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement