నా పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకోండి | Take inspiration from my book | Sakshi
Sakshi News home page

నా పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకోండి

Dec 11 2013 1:15 AM | Updated on Sep 2 2017 1:27 AM

మహిళలు తన ఆటోబయోగ్రఫీ ‘అన్‌బ్రేకబుల్’ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ల కలలను సాకారం చేసుకోవాలని భారత మేటి బాక్సర్ మేరీకామ్ పిలుపునిచ్చింది.

ముంబై: మహిళలు తన ఆటోబయోగ్రఫీ ‘అన్‌బ్రేకబుల్’ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ల కలలను సాకారం చేసుకోవాలని భారత మేటి బాక్సర్ మేరీకామ్ పిలుపునిచ్చింది. ‘మహిళల సమస్యల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను కూడా వాటిని ఎదుర్కొన్నా. అవి ఏమిటనేవి నా పుస్తకంలో కూలంకషంగా వివరించా.

 సవాళ్లను ఎదురించి కలలను నిజం చేసుకోవడానికి ఇతర మహిళలు ఈ పుస్తకాన్ని  ప్రేరణగా తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని సోమవారం రాత్రి పుస్తకం విడుదల కార్యక్రమంలో మేరీకామ్ వ్యాఖ్యానించింది. తన జీవితంలో బయటకు చెప్పుకోలేని ఎన్నో కథనాలను ఈ పుస్తకంలో పొందుపర్చానంది. ‘ఓ మహిళ జీవితంలో పురుషుడి మద్దతు ఎలా ఉంటుందన్నదే ఈ బుక్ సారాంశం’ అని ఈ మేరీకామ్ వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement