జూన్‌ 30 వరకు టోర్నీలు రద్దు 

Table Tennis Tournament Postponed Until June 30 Due To Coronavirus - Sakshi

ఐటీటీఎఫ్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా కల్లోలానికి వాయిదా లేదా రద్దవుతోన్న క్రీడల జాబితాలో తాజాగా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) కూడా చేరింది. కరోనా ప్రభావంతో జూన్‌ 30 వరకు జరగాల్సిన అన్ని అంతర్జాతీయ ఈవెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ప్రకటించింది. అంతేకాకుండా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో జూన్‌ 30 వరకు ఎలాంటి మార్పులు చేయరాదని, మార్చి నెలలో ఉన్న ర్యాంక్‌లనే కొనసాగించాలని నిర్ణయించింది. ‘కరోనా కారణంతో ఏర్పడిన అనిశ్చితి వలన ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మేము  కఠిన నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. జూన్‌ 30 వరకు జరగాల్సిన అన్ని ఐటీటీఎఫ్‌ టోర్నీలను రద్దు చేస్తున్నాం’ అని తమ ప్రకటనలో ఐటీటీఎఫ్‌ తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top