చెస్ విజేత సుశీల్ రెడ్డి | sushil reddy won chess championship title | Sakshi
Sakshi News home page

చెస్ విజేత సుశీల్ రెడ్డి

Apr 2 2014 12:34 AM | Updated on Sep 2 2017 5:27 AM

రంగారెడ్డి జిల్లా చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పి.సుశీల్‌రెడ్డి చేజిక్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్ (ఆర్‌ఆర్‌సీఏ) ఆధ్వర్యంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో పి.సుశీల్‌రెడ్డి ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

 రంగారెడ్డి జిల్లా చాలెంజర్స్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పి.సుశీల్‌రెడ్డి చేజిక్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్ (ఆర్‌ఆర్‌సీఏ) ఆధ్వర్యంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఫైనల్  రౌండ్‌లో  పి.సుశీల్‌రెడ్డి ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
 
హరిలాస్య (4.5)కు పాయింట్లతో రెండో స్థానం దక్కింది. డి.చైతన్య (4), ఎ.ఆర్.ఆర్.పి.వ్యాహ్రుత్(4) వరుసగా మూడు, నాలుగో స్థానాలు పొందారు.

ఈ పోటీల విజేతలకు రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఆర్‌సీఏ అధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, డీపీఎస్ ఫిజికల్ డెరైక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో భాగంగా రాష్ట్ర అండర్-9 చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టులో నతురా బేతి, హంసిక... బాలుర జట్టులో శ్రీరామ్ ప్రణయ్, కె.నిఖిల్ ఎంపికయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement