త్వరలో సురేష్ రైనా పెళ్లి? | suresh raina ready to wedlock very soon? | Sakshi
Sakshi News home page

త్వరలో సురేష్ రైనా పెళ్లి?

Mar 14 2015 4:50 PM | Updated on Sep 2 2017 10:51 PM

త్వరలో సురేష్ రైనా పెళ్లి?

త్వరలో సురేష్ రైనా పెళ్లి?

జీవితంలో అతి పెద్ద మ్యాచ్ పెళ్లే అన్న టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా? ఆ మ్యాచ్ కు రెఢీ అవుతున్నాడా? అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి.

ఘజియాబాద్:జీవితంలో అతి పెద్ద మ్యాచ్ పెళ్లే అన్న టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా? ఆ మ్యాచ్ కు రెఢీ అవుతున్నాడా? అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. వరల్డ్ కప్ తర్వాత రైనాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైనా తల్లి తన స్నేహితురాలి కూతురితో అతని వివాహం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.  అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రైనా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో రైనా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా.. అప్పట్లో ఆ ఏడు అడుగులకు ముహూర్తం ఖరారు కాలేదు. గత కొంతకాలంగా క్రికెట్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న రైనాకు ఇక పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయాలని భావిస్తుండటంతో అతనికి త్వరలో మూడు ముళ్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సురేష్ రైనా ఆకట్టుకుంటున్నాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో రైనా సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement