విండీస్ కోచ్గా స్టువర్ట్ లా | Stuart Law named West Indies coach | Sakshi
Sakshi News home page

విండీస్ కోచ్గా స్టువర్ట్ లా

Jan 28 2017 2:35 PM | Updated on Sep 5 2017 2:21 AM

విండీస్ కోచ్గా స్టువర్ట్ లా

విండీస్ కోచ్గా స్టువర్ట్ లా

గతేడాది సెప్టెంబర్ లో ఫిల్ సిమ్మన్స్ను కోచ్గా తొలగించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు కొత్త కోచ్ను నియమించింది.

ఆంటిగ్వా: గతేడాది సెప్టెంబర్ లో ఫిల్ సిమ్మన్స్ను కోచ్గా తొలగించిన వెస్టిండీస్ క్రికెట్  బోర్డు ఎట్టకేలకు కొత్త కోచ్ను నియమించింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ లాను కోచ్గా నియమించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసిన విండీస్ క్రికెట్ బోర్డు.. వచ్చే నెల 15వ తేదీ నుంచి స్టువర్ట్ లా జట్టు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. గతంలో శ్రీలంకకు కోచ్గా పని చేసిన స్టువర్ట్ లా అనుభవం తమకు ఉపయోగపడుతుందని విండీస్ బోర్డు అభిప్రాయపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement