ఆ ప్రైజ్‌మనీ ఇవ్వలేదింకా... 

Still We Did Not Get Prize Money Says Ranji Trophy Bengal Team - Sakshi

రంజీ ట్రోఫీ రన్నరప్‌ బెంగాల్‌కు రూ. కోటి నగదు బహుమతి విడుదల చేయని బీసీసీఐ

కోల్‌కతా: రంజీ ట్రోఫీ రన్నరప్‌గా నిలిచిన బెంగాల్‌ జట్టుకు ఇంకా ఆ ప్రైజ్‌మనీ విడుదల కాలేదు. రూ. కోటి రావాల్సి ఉంది. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు అవిõÙక్‌ దాలి్మయా చెప్పారు. మార్చి రెండో వారంలో ఈ టోర్నీ ముగియగా సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. శుక్రవారం బెంగాల్‌ జట్టు ఆటగాళ్లకు ఆన్‌లైన్‌ సెషన్‌ నిర్వహించగా... ఓ ఆటగాడు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఈ సంగతి మీడియాకు తెలిసింది. దీనిపై బెంగాల్‌ ఆటగాడొకరు మాట్లాడుతూ ‘ఇది ఫిర్యాదుగా భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మాకూ తెలుసు. కానీ మూడు నెలలు పూర్తయినా ఆ మొత్తం రాకపోవడం నిరాశగా ఉంది’ అని అన్నాడు. క్యాబ్‌ అధ్యక్షడు అవిõÙక్‌ స్పందిస్తూ ఈ విషయంలో అసోసియేషన్‌ చురుగ్గా పనిచేస్తోందని, దీనికి సంబంధించిన వ్యవహారాలు, అంతర్గత ఆడిట్‌ త్వరలోనే పూర్తి చేసి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపిస్తామని, రావాల్సిన ప్రైజ్‌మనీని త్వరలోనే విడుదల చేసేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. అయితే విజేతగా నిలిచిన సౌరాష్ట్రకు కూడా ఇటీవలే ప్రైజ్‌మనీని విడుదల చేసినట్లు తెలిసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top