ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా బౌలింగ్ అనుమానాస్పదంగా ఉండటంతో అంపైర్లు దృష్టి సారించారు.
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక పేసర్ షమిందా ఎరంగా బౌలింగ్ అనుమానాస్పదంగా ఉండటంతో అంపైర్లు దృష్టి సారించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. ఆ టెస్టు మ్యాచ్లో ఎరంగాకు ఎటువంటి వికెట్లు లభించకపోయినా, అతని బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, ఎస్ రవిలు తొలుత మ్యాచ్ రిఫరీ ఆండీ పాయ్కాట్ దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం అతని బౌలింగ్ శైలిని పరీక్షించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎరంగా 14 రోజుల్లో తన బౌలింగ్ యాక్షన్కు సంబంధించి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అప్పటివరకూ ఎరంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.