ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు | Sri Lanka win over by Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు

Jun 18 2016 12:18 AM | Updated on Sep 4 2017 2:44 AM

ఆల్‌రౌండర్ షనక (42; 5/43) దుమ్మురేపడంతో... గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 76 పరుగుల తేడాతో.....

మాలాహైడ్ (ఐర్లాండ్): ఆల్‌రౌండర్  షనక (42; 5/43) దుమ్మురేపడంతో... గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 76 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఐర్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు చేసింది. చండిమల్ (107 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు.

తర్వాత ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్‌ఫీల్డ్ (73), కెవిన్ ఓబ్రియాన్ (64) మినహా మిగతా వారు విఫలమయ్యారు. వర్షం వల్ల ఐర్లాండ్‌కు 47 ఓవర్లలో 293 పరుగుల లక్ష్యం నిర్దేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement