వార్నర్‌ దూరమైనా ఇబ్బంది లేదు: సాహా  | SRH strong enough to replace Warner: Saha | Sakshi
Sakshi News home page

వార్నర్‌ దూరమైనా ఇబ్బంది లేదు: సాహా 

Mar 28 2018 1:25 AM | Updated on Mar 28 2018 1:25 AM

SRH strong enough to replace Warner: Saha - Sakshi

కోల్‌కతా: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అతను లేకున్నా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎలాంటి నష్టం లేదని ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా తెలిపాడు. తమ జట్టు రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉందని... వార్నర్‌ గైర్హాజరీ తమపై పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వార్నర్‌ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మా జట్టులో ఉంది. కెప్టెన్‌ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుంది.

ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడొచ్చేమో కానీ... మా రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు’ అని అన్నాడు. వార్నర్‌ స్థానాన్ని శిఖర్‌ ధావన్‌ భర్తీ చేస్తాడా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘అది జట్టు మేనేజ్‌ మెంట్‌ నిర్ణయిస్తుంది. సారథి ఎవరైనా లక్ష్యం మాత్రం విజయమే’ అని స్పష్టం చేశాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయం వరకు వార్నర్‌పై ఎలాంటి ప్రకటన చేయబోమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలపగా... ప్రస్తుత పరిణామాల ప్రకారం క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌ఫై ఏడాది నిషేధం విధించే యోచనలో కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement