శ్రవణ్ రావు అద్భుత సెంచరీ | sravan rao slams big century | Sakshi
Sakshi News home page

శ్రవణ్ రావు అద్భుత సెంచరీ

Dec 6 2016 10:48 AM | Updated on Sep 4 2017 10:04 PM

ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో రాజూస్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ ఎ. శ్రవణ్ రావు (149) అద్భుత సెంచరీతో చెలరేగాడు.

సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో రాజూస్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ ఎ. శ్రవణ్ రావు (149) అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో సత్య సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజూస్ క్లబ్ 37 ఓవర్లలో 294 పరుగులు చేసింది. శ్రవణ్ రావు త్రుటిలో 150 పరుగుల మార్క్‌ను కోల్పోయాడు. కమల్ యాదవ్ (39) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కె. రిత్విక్ రెడ్డి 5, హర్ష 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ జట్టు 33.2 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రిత్విక్ రెడ్డి (30), గౌరీ శంకర్ (39) పోరాడారు. రాజూస్ క్లబ్ బౌలర్లలో శ్రవణ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు


 రోషనారా సీసీ: 341/6 (ముకేశ్ 76, సయ్యద్ జీషాన్ 53, బిజయ్ కల్యాణ్ 56 నాటౌట్), ఎల్‌ఎన్‌సీసీ: 88 (అమీర్ 3/25, కునాల్ 3/20, విను 3/29).
 రంగారెడ్డి జిల్లా: 87 (నదీమ్ ఖాన్ 3/10), షాలిమార్ సీసీ: 92/1 (నదీమ్ ఖాన్ 51 నాటౌట్).
 హైదరాబాద్ వాండరర్స్: 167 (జమీల్ 62; భరద్వాజ్ 4/40), అక్షిత్ సీసీ: 168/3 (రిత్విక్ 61 నాటౌట్, శ్రునోత్ 43).
 మహేశ్ సీసీ: 209 (పి. వినయ్ 43, కె. శ్రవణ్ 55 నాటౌట్; రాజశేఖర్ 7/68), కాకతీయ సీసీ: 181 (అనంత్ 54; వినయ్ 4/20).
 సాక్రెడ్ హార్ట్: 244 (లెస్లీ 102, జెరోమ్ 42; చైతన్య 4/50, స్వామి 3/36), ఎంపీ బ్లూస్: 247/8 (రాజు 59, యేసుదాస్ 3; లెస్లీ 5/52).
 ఎస్‌ఎన్ గ్రూప్: 127 (శ్రీనివాస్ 3/28, భరత్ 4/9), అంబర్‌పేట్ సీసీ: 128/6 (రిజ్వాన్ 39 నాటౌట్).
 అక్షిత్ సీసీ: 319 (శ్రునోత్ 79, షహాంక్ 63; సంజయ్ 3/78), యూనివర్సల్ సీసీ: 149 (యశ్వంత్ 47).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement