మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్ | SLC reluctant to give Malinga NoC to play in IPL | Sakshi
Sakshi News home page

మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్

Apr 12 2016 5:21 PM | Updated on Sep 3 2017 9:47 PM

మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్

మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్

ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తిరస్కరించింది.

కొలంబో: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్లో ఆడే అవకాశాలు లేనట్టే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తిరస్కరించింది.

మలింగా ప్రస్తుత ఫిట్నెస్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాతే ఎన్ఓసీ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తామని లంక క్రికెట్ బోర్డు చీఫ్‌ తిలంగ సుమతిపాల చెప్పారు. తమ అనుమతి లేకుండా మలింగా ఐపీఎల్లో ఆడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిలంగ సుమతిపాలకు, మలింగాకు మధ్య ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నట్టు సమాచారం. టి-20 ప్రపంచ కప్నకు ముందు లంక కెప్టెన్ పదవి నుంచి మలింగాను తప్పించారు. ఈ టోర్నీకి మలింగా ఎంపికైనా ఫిట్నెస్ సమస్యలు చూపి జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో ప్రధాన బౌలర్ లేకుండానే లంక ప్రపంచ కప్లో బరిలో దిగాల్సివచ్చింది. లంక ఓటమికి ఇది కూడా ఓ కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement