కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు | Sindhu loses in semis, settles for bronze | Sakshi
Sakshi News home page

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

Aug 10 2013 1:52 PM | Updated on Sep 1 2017 9:46 PM

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది.

గ్వాంగ్‌జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. దాంతో పుసర్ల వెంకట సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం దక్కింది.  తనకన్నా మెరుగైన థాయిలాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతినాన్‌ చేతిలో సింధు 21-10, 21-13 స్కోరుతో పరాజయం పాలైంది.

36 నిమిషాల పేపు జరిగిన ఈ పోరాటంలో మొదటి సెట్‌లో సింధు చేసిన పొరబాట్లతో నాలుగో సీడ్‌ రచనోక్‌ లాభ పడిందింది. రెండో గేమ్‌లో సింధు పుంజుకున్నప్పటికీ, ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రకాష్‌ పడుకొనే తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారిణి సింధు కావడం విశేషం. నిరుడు మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్విని కాంస్య పతకాన్ని గెలుపొందారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement