ప్రిక్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషాల్

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరవ్ ఘోషాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌరవ్ రెండో రౌండ్‌లో 13–11, 11–6, 11–8తో లుకాస్ సెర్మీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో జోష్నా 10–12, 7–11, 7–11తో జాయ్ చాన్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది.
World Squash Championship: Saurav Ghosal enters pre-quarters, Joshna Chinappa out
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి