చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రిలో భారత షట్లర్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు.
తైపీ: చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రిలో భారత షట్లర్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన ర్యోటరో మరౌను 11-6, 11-8, 11-6తో ఓడించాడు. తొలి గేమ్‌లో 4-0తో దూసుకెళ్లినా ప్రత్యర్థి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా సౌరభ్ గేమ్‌ను ముగించాడు.
ఇక రెండో గేమ్‌లో ఏకంగా 7-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అద్భుతంగా రాణించాడు. చివరి గేమ్ ప్రారంభంలో కాస్త పోటీ ఎదురైనా ఫలితంపై ప్రభావం చూపలేదు. నేడు (శుక్రవారం) జరిగే క్వార్టర్స్‌లో కెంటో హొరియుచి (జపాన్)తో సౌరభ్ తలపడనున్నాడు.