భారత జట్టులో సంజన, భక్తి షా | Sanjana, Bhakti Shaw in Under 16 Fedcup | Sakshi
Sakshi News home page

భారత జట్టులో సంజన, భక్తి షా

Apr 16 2019 3:26 PM | Updated on Apr 16 2019 3:26 PM

Sanjana, Bhakti Shaw in Under 16 Fedcup - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ఓసియానియా జూనియర్‌ ఫెడ్‌కప్‌ అండర్‌–16 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయిలు సంజన సిరిమల్ల, భక్తి షా చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ తెలంగాణ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు సుదీప్త సెంథిల్‌ కుమార్, నమితా బాల్‌ ఫెడ్‌కప్‌లో భారత్‌ తరఫున ఆడనున్నారు.

గ్రూప్‌ ‘ఎ’ లో ఉన్న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. భారత్‌తో పాటు గ్రూప్‌ ‘ఎ’లో టాప్‌ సీడ్‌ ఆస్ట్రేలియా, ఐదో సీడ్‌ జపాన్, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌ ‘బి’లో థాయ్‌లాండ్, లెబనాన్, మలేసియా, చైనీస్‌ తైపీ... గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా, హాంకాంగ్, పసిఫిక్‌ ఓసియానియా, చైనా... గ్రూప్‌ ‘సి’లో కొరియా, శ్రీలంక, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్‌ జట్లు చోటు దక్కించుకున్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement