కామన్‌ వెల్త్‌ గేమ్స్‌కు మాలిక్‌ అర్హత | Sakshi Malik qualifies for 2018 Commonwealth Games | Sakshi
Sakshi News home page

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌కు మాలిక్‌ అర్హత

Dec 30 2017 8:34 PM | Updated on Dec 30 2017 8:34 PM

Sakshi Malik qualifies for 2018 Commonwealth Games

న్యూఢిల్లీ : ఒలింపిక్‌ పతక విజేత, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ 2018లో జరగనున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌(సీడబ్ల్యూజీ)కు అర్హత సాధించారు. వచ్చే ఏడాది కిర్గిస్థాన్‌లో జరగనున్న  సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారతీయ మహిళా రెజ్లింగ్‌ టీం ఎంపిక శనివారం లక్నోలో జరిగింది.

62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్‌ సీడబ్ల్యూజీకి అర్హత సాధించారు. మాలిక్‌తో పాటు వినేష్‌ ఫొగాట్(50 కేజీలు)‌, పూజా ధాండా(57కేజీలు), బబితా కుమారి ఫొగాట్(54 కేజీలు)‌, దివ్య కరణ్(68కేజీలు)‌, కిరణ్‌(76 కేజీలు) విభాగాల్లో రెండు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. సీడబ్ల్యూజీ 2018 ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement